వరంగల్ జిల్లాలో ముగిసిన పరామర్శ యాత్ర | YS Sharmila paramarsha yatra ends in warangala district, begins in karimnagar district | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో ముగిసిన పరామర్శ యాత్ర

Sep 22 2015 3:40 PM | Updated on May 29 2018 4:23 PM

వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో 73 కుటుంబాలను ఆమె పరామర్శించారు.

వరంగల్ :  వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో 73 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఇవాళ ఉదయం వైఎస్ షర్మిల... పాలంపేటలో ఫహీముద్దీన్, ఘణపురంలో కోటగిరి రవీందర్, ధర్మారావుపేటలో గంపల లక్ష్మీ కుటుంబ సభ్యులు  పరామర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.

కరీంనగర్ జిల్లాలో ప్రారంభం: వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది.  నేటి సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారు జిల్లాలో మొత్తం 30మంది ఉండగా, తొలివిడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను పరామర్శించనున్నారు.

 

తొలిదశ పరామర్శ యాత్రలో మంథని, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి నియోజకవర్గాల మీదుగా మొత్తం 371 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తారు. కాగా వరంగల్ జిల్లాలో యాత్ర ముగించుకుని కరీంనగర్ జిల్లాకు ప్రవేశించిన ఆమెకు వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు మేడిపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement