యువతి అదృశ్యం | Young girl missing in medak | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Nov 6 2017 11:34 AM | Updated on Nov 6 2017 11:34 AM

Young girl missing in medak - Sakshi

తూప్రాన్‌: తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ తండాకు చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్సై పరుశురాంగౌడ్‌ ఆదివారం తెలిపారు. ఇస్లాంపూర్‌ తండాకు చెందిన లంబాడి రవీందర్‌ పెద్ద కూతురు సోని(16) తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంలోని చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం తండాకు చెందిన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన సోని సాయంత్రం ఇంటికి తిరిగిరాలేదన్నారు. తోటి స్నేహితులు సినిమా చూస్తున్న సమయంలోనే సినిమా థియేటర్‌ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారన్నారు. దీంతో సోని ఆచూకి కోసం చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల వద్ద ఆరాతీసినా ఎలాంటి ఆచూకీ లభించలేదన్నారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement