ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాలి 

You Should Behave According To The Election Code - Sakshi

సాక్షి, హుజూరాబాద్‌ రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నియామవళిని అందరూ పాటించాలని హుజూరాబాద్‌ టౌన్‌ సీఐ వాసంశెట్టి మాధవి అన్నారు. గురువారం మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో  ఎన్నికల కోడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం, డబ్బులు సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసేలా ఎవరూ ప్రవర్తించిన ఉపేక్షించేది లేదన్నారు.

ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని ఇప్పలనర్సింగాపూర్, బోర్నపల్లి, పోతిరెడ్డిపేట, వెంకట్రావ్‌పల్లి గ్రామాల్లో వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.15 వేల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించని వాహనదారులపై ఈ–పెట్టి కింద కేసులను నమోదు చేయడంతోపాటు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.  ఎస్సై చంద్రశేఖర్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top