‘మన సంప్రదాయాలు ప్రపంచానికి దిక్సూచి’ | World Telangana Convention concludes in Houston | Sakshi
Sakshi News home page

‘మన సంప్రదాయాలు ప్రపంచానికి దిక్సూచి’

Jul 4 2018 1:11 AM | Updated on Jul 4 2018 1:11 AM

World Telangana Convention concludes in Houston - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి దిక్సూచిలా మారాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అమెరికాలో జరుగుతున్న తెలంగాణ అసోసియేషన్‌ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటు న్న తెలంగాణ వారిని మంత్రి అభినందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ  రోల్‌మోడల్‌గా మారిందన్నారు.

17 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్‌–1 స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు ఎన్‌ఆర్‌ఐలు తోడ్పాటునందించాలని ప్రవాస తెలంగాణ సంఘాలను మంత్రి కోరారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా చార్లేట్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వనభోజనాల కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement