కష్టపడి పనిచేసి జిల్లాకు పేరు తేవాలి | Sakshi
Sakshi News home page

కష్టపడి పనిచేసి జిల్లాకు పేరు తేవాలి

Published Fri, Apr 24 2015 1:17 AM

work hard and bring goos name to district

- రెవెన్యూ ఉద్యోగులకు
- జేసీ వెంకట్‌రాంరెడ్డి పిలుపు
సంగారెడ్డి క్రైం:
విధి నిర్వహణలో కష్ట పడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని జాయింట్ కలెక్టర్ పి.వెంకట్‌రాం రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు సూచించా రు.తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ నాయకులతో గురువారం ఆయన సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జేసీ ఉద్యోగుల సమస్యల పై చర్చించారు.

ఉద్యోగుల సమస్యలను నేరుగా తన దృష్టికి తెస్తే త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. ముఖ్యంగా అర్హత గల సీనియర్ సహాయకులకు ఉప తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని, అర్హత గల ఆఫీస్ సబార్డినేట్లకు జూనియర్/రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పించాలని, సీనియర్ సహాయకులకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా నియమించాలని ఉద్యోగులు జేసీకి విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.శివప్రసాద్, కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, అసోసియేట్ అధ్యక్షుడు బొమ్మ రాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.సతీష్‌కుమార్, సాంస్కృతిక కార్యదర్శి గుండేరావు, సంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడు షఫీయొద్దీన్, కార్యదర్శి సురేష్, గంగాధర్‌రావు, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, చంద్రకాంత్, కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement