మద్యం మత్తులో భార్యను చంపిన భర్త | womer died in nalgonda distirict | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

Feb 12 2015 4:14 PM | Updated on Jul 30 2018 8:29 PM

నల్లగొండ జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది.

నల్లగొండ : నల్లగొండ జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను రాడ్ తో కొట్టి చంపాడో భర్త. వివరాలు.. కోదాడ కు చెందిన వేముల రమేష్ అనే వ్యక్తి గురువారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమేష్ ఇనుపరాడ్‌తో భార్య రమణ(35) తలపై కొట్టాడు.

దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్తానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(కోదాడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement