
ఓ దుకాణదారుడు రూ.20కే చీరంటూ చేసిన ప్రకటనతో గురువారం మహిళలంతా అక్కడికి పోటెత్తారు
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లిలో ఓ వస్త్ర దుకాణంలో రూ.20లకే చీర అని ఆఫర్ పెట్టడంతో మహిళలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఓ దుకాణదారుడు రూ.20కే చీరంటూ చేసిన ప్రకటనతో చుట్టుపక్క గ్రామాల మహిళలంతా షాపు వద్దకి పోటెత్తారు. ఉదయం నుంచే దుకాణం ముందు అర కిలోమీటరు మేర బారులు తీరారు. దుకాణం తెరవగానే చీరలను దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వారిని అదుపు చేయడంలో విఫలమైన నిర్వాహకులు చివరకు దుకాణాన్ని తాత్కాలికంగా మూసేశారు.