ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ ఇల్లాలి ఘాతుకం

Women kills husband for insurence money in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు చిక్కింది ఓ ఇల్లాలు. భర్త ఉద్యోగంతో పాటు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ వద్ద చోటుచేసుకుంది.

వివరాలు.. మిర్యాలగూడకు చెందిన కేస్యా నాయక్, పద్మ భార్యాభర్తలు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నాయక్‌ చనిపోతే, అతడి ఉద్యోగంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే దురాశతో భార్య పద్మ, మరో వ్యక్తి వినోద్ సాయంతో హత్య చేసింది. ముందుగా నాయక్‌కు ఊపిరాడకుండా చేసి, అనంతరం కారును ఓ ఎలక్ట్రిక్ పోల్‌కు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పద్మతోపాటు వినోద్ కూడా నేరం చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top