మహిళలు ఆదిపరాశక్తులైపోయారు. తరచూ తమని వేధిస్తున్న ఓ రౌడీషీటర్ని చితక బాది చంపేశారు.
కరీంనగర్: మహిళలు ఆదిపరాశక్తులైపోయారు. తరచూ తమని వేధిస్తున్న ఓ రౌడీషీటర్ని చితక బాది చంపేశారు. కోనారావుపేట మండలం శివగాలపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
రౌడీ షీటర్ శంకర్‌కు తరచూ మహిళలను వేధించడం అలవాటైపోయింది. ఆ వేధింపులకు తట్టుకోలేక మహిళలందరూ ఒక్కటయ్యారు. శంకర్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రౌడీషీటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.