మహిళ అనుమానాస్పద మృతి | Woman suspicious death | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Sep 25 2015 2:57 PM | Updated on Sep 3 2017 9:58 AM

రామక్రిష్ణాపురం పట్టణంలోని శిశుమందిర్ స్కూల్ పక్కనున్న చెట్లపొదల్లో శుక్రవారం ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.

రామక్రిష్ణాపురం (ఆదిలాబాద్) : రామక్రిష్ణాపురం పట్టణంలోని శిశుమందిర్ స్కూల్ పక్కనున్న చెట్లపొదల్లో శుక్రవారం ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. మృతిచెందిన మహిళను రామక్రిష్ణాపురానికి చెందిన సుద్దాల శైలజ(24)గా గుర్తించారు. మహిళ ఒంటిపై రక్తపు మరకలు ఉండటంతో బాగా దెబ్బలు కొట్టడం వల్ల మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement