యువతిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు | Woman murdered in Rangareddy district | Sakshi
Sakshi News home page

యువతిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు

Aug 10 2014 8:47 AM | Updated on Mar 28 2018 11:05 AM

రంగారెడ్డి జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు హత్య చేసి తగులబెట్టారు.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఆ విషయాన్ని ఆదివారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి హత్యపై పోలీసులు గ్రామస్తులను ప్రశ్నిస్తున్నారు. యువతి మృతదేహంలోని సరిగా కాలని శరీర భాగాలను పోలీసులు సేకరించారు. పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement