వరంగల్ జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రేగొండ మండలం రంగయ్యగారిపల్లె గ్రామానికి చెందిన వంతెన లక్ష్మి (35) భర్తకు దూరంగా ఉంటోంది. బుధవారం ఉదయం ఆమె తలకు గాయాలైన స్థితుల్లో మృతి చెందగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.