లారీ ఢీకొని మహిళ మృతి | woman died and one injured in a road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

Jun 30 2015 6:54 AM | Updated on Sep 3 2017 4:38 AM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది.

ఖమ్మం: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకనగర్ కాలనిలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు... పశ్చిమ గోదావరి జిల్లా చింతలపుడి మండలానికి చెందిన మల్లెలరంగయ్య(42) పెంటమ్మతో(35) కలిసి వినాయకనగర్ కాలనిలో గత ఎనిమిదేళ్లుగా సహ జీవనం చేస్తున్నాడు.

ఈరోజు ఉదయం వినాయకనగర్ కాలని నుంచి వినాయకపురం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. అశ్వరావుపేట నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద అదుపుతప్పి వారి పైకి దూసుకువచ్చింది. దీంతో పెంటమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. రంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి త రలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement