మహిళ ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Jan 5 2016 5:27 PM | Updated on Nov 6 2018 7:56 PM

కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. గ్రామానికి చెందిన వనపట్ల సూర్యకళ(36) అనే మహిళను అదే గామానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి సోమవారం తీవ్రంగా కొట్టాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాధవరావు కొట్టాడనే మనస్తాపంతోనే సూర్యకళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement