గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు విత్‌డ్రా చేసుకోండి

Withdraw case in the Green Tribunal - Sakshi

15 రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల పనులకు టెంకాయ కొడతాం: మంత్రి హరీశ్‌

పరిగి: కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు విత్‌డ్రా చేసుకుంటే 15 రోజుల్లో పరిగిలో పాలమూరు ఎత్తిపోతల పనులకు టెంకాయ కొడతామని భారీ నీటిపారుదల మంత్రి  టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, విద్యా మౌలిక వన రుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ కొప్పుల మహేశ్‌రెడ్డితో కలసి పరిగిలో పర్యటించారు. 

బీఎంఆర్‌ ఫౌండేషన్‌  నిర్వహిస్తున్న పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో మెటీరియల్‌ పంపి ణీ చేశారు. అనంతరం మండల పరిధిలోని లఖ్నాపూర్‌ ప్రాజెక్టును రూ.8.15 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులకు హరీశ్‌రావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

పరిగి ఎమ్మెల్యే ఓ టైపు మనిషి
ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అంతా ఓ టైపు మనిషి.. వాళ్ల పార్టీ తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారని విమర్శించారు. మీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెప్పి కేసు విత్‌డ్రా చేయించమనండి.. లేదంటే హర్షవర్ధన్‌రెడ్డితో తమకు సంబంధం లేదని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఈ సందర్భంగా మంత్రి సవాల్‌ విసిరారు. త్వరలో 9,600 పంచాయతీ కార్యదర్శులను కొత్త జిల్లాల వారీగా చేపడతామని తెలిపారు.

రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలకు సంబంధించిన సవరణ ఆమోదం కోసం సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. 16 వేల కానిస్టేబుల్, రెండు వేల ఎస్‌ఐ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రూ.480 కోట్లతో 1,450 చెరువుల్లో మిషన్‌ భగీరథ పనులు చేపట్టామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top