
విఠల్‌రెడ్డిపై తగిన చర్యలు: జానారెడ్డి
కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు నిర్ధారణ అయితే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన అదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు నిర్ధారణ అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని సీఎల్పీనేత జానారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నామని, దీనిపై ఎమ్మెల్యే వివరణ కోరి తదుపరి చర్యలు తీసుకుంటామని జానారెడ్డి పేర్కొన్నారు.