మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం | Will opposeit proposed bill for 12% quota for Muslims : k. laxman | Sakshi
Sakshi News home page

మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం

Feb 5 2017 2:32 AM | Updated on Sep 5 2017 2:54 AM

మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం

మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం

టీఆర్‌ ఎస్‌ మతపరమైన రాజకీయాలకు పాల్ప డుతోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

కె.లక్ష్మణ్‌
సంగారెడ్డిజోన్‌: టీఆర్‌ఎస్‌ మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగినం దున ఆ విద్వేషాలు ఇప్పటికీ కొనసాగుతు న్నాయని చెప్పారు. మతపరమైన రిజర్వే షన్లకు వ్యతిరేకంగా సంగా రెడ్డిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిం దని లక్ష్మణ్‌ అన్నారు.

మరోమారు ఈ రిజర్వేషన్లతో ప్రజలను విడదీసే కుట్ర జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించేది లేదని స్పష్టం చేశా రు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించా లన్నారు. పేద ముస్లింలకు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాన వతా దృక్పథంతో స్పందించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement