గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్ | will have our right forcefully, says minister ktr | Sakshi
Sakshi News home page

గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్

Mar 4 2015 6:40 PM | Updated on Aug 30 2019 8:24 PM

గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్ - Sakshi

గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యుత్తులో తెలంగాణ వాటాను గల్లాపట్టి సాధించుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే కరెంటు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ వాటాను గల్లాపట్టి సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రైతుల పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటే సాగర్ నుంచి నీళ్లు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలను గుర్తించి త్వరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement