చైనా ఉత్పత్తులపై నిషేధం | Wholesale Merchants Association Ban On Chinese Products | Sakshi
Sakshi News home page

చైనా ఉత్పత్తులపై నిషేధం

Jun 19 2020 2:22 AM | Updated on Jun 19 2020 2:37 AM

Wholesale Merchants Association Ban On Chinese Products - Sakshi

అబిడ్స్‌(హైదరాబాద్‌): భారత్, చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల ప్రభావంతో హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారుల సంఘం చైనా ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  బేగంబజార్, ఫీల్‌ఖానా, సిద్ది అంబర్‌బజార్, ఉస్మాన్‌గంజ్‌ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి చైనా ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తున్నట్లు హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీరామ్‌వ్యాస్‌ గురువారం వెల్లడించారు. ఫీల్‌ఖా నాలో అసోసియేషన్‌ ప్రతినిధులంతా చైనా ఉత్పత్తులను నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫీల్‌ఖానా మార్కెట్‌తో పాటు బేగంబజార్‌లో ఉన్న అజీజ్‌ప్లాజా మార్కెట్‌లో వేలాది దుకాణాల్లో ప్రతి రోజు చైనా ఉత్పత్తులను విక్రయాలు చేస్తారు. కాగా, ప్రతి రోజు జనరల్‌ మర్చంట్స్‌ దుకాణాల ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీరామ్‌వ్యాస్‌ వివ రించారు. కరోనా కారణంగా వ్యాపార సమయాలు కుదించినట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement