కూటమి వస్తే సీఎం రేవంత్‌ రెడ్డేనా?

Who Is CM Candidate In Mahakutami - Sakshi

ఆజాద్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీలో కలకలం 

కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు?

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కుర్చీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఈరోజు సీఎం కుర్చీలో కేసీఆర్‌ ఉన్నారు. రేపు అదే కుర్చీలో రేవంత్‌ రెడ్డి కూడా ఉండొచ్చు’ అంటూ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ సీనియర్‌ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే  సీఎం ఎవరు? రేవంత్‌ రెడ్డెనా? ఎన్నికల కీలక దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే చర్చకు దారితీశాయి. ఆయన వ్యూహత్మకంగా అన్నారా లేక, ఆయాచితంగా అన్నారా? అనే  ప్రశ్న సీనియర్‌ నేతలను వెంటాడుతోంది. 

కాగా సీఎం రేసులో ఇదివరకే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి సపోర్టుతో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రేవంత్‌.. ఆయన పరిచయాలతోనే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పలువురు నేతలకు టికెట్లు దక్కించుకోగలిగారు. కొడంగల్‌లోని రేవంత్‌ నివాసంలో ఆయనను పరామర్శించిడానికి వెళ్లిన ఆజాద్‌ సీఎం పీఠంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top