వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి | Whether the working president | Sakshi
Sakshi News home page

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి

Mar 25 2014 2:08 AM | Updated on Sep 2 2017 5:07 AM

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి

సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు కమిటీల్లో జిల్లాకు చెందిన ఐదుగురికి స్థానం లభించింది.

  •     ప్రధాన కార్యదర్శిగా రేవూరి
  •      టీడీపీ కమిటీలో జిల్లా నేతలకు చోటు
  •      మేనిఫెస్టో కమిటీలో ముగ్గురు
  •  సాక్షి, హన్మకొండ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు కమిటీల్లో జిల్లాకు చెందిన ఐదుగురికి స్థానం లభించింది. తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించారు. ఇదే కమిటీకి ప్రధాన కార్యదర్శిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. తెలుగుదేశం తెలంగాణ మేనిఫెస్టో కమిటీలో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో సోమవారం ప్రకటించారు.
     
     వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరి..

     తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని ఆశించిన టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నిరాశే ఎదురైంది. కొత్త రాష్ట్రంలో పార్టీపై పట్టు కోసం ఎర్రబెల్లి చేసిన ప్రయత్నాలకు చంద్రబాబునాయుడు గండికొట్టారు.

    ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపుచ్చారు. తెలంగాణ ఎన్నికల కమిటీ  కార్యనిర్వాహక అధ్యక్ష (వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కట్టబెట్టారు. రాష్ట్ర స్థాయిలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పదవి ఇచ్చినా... ఇదే స్థాయి పదవి ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి చంద్రబాబునాయుడు ఇచ్చారు.
     

Advertisement
 
Advertisement
Advertisement