మీ బిడ్డగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడతా: ఈటల | Welfare Schemes Will Be Win TRS | Sakshi
Sakshi News home page

మీ బిడ్డగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడతా: ఈటల

Dec 5 2018 6:05 PM | Updated on Mar 25 2019 3:09 PM

 Welfare Schemes Will Be Win TRS - Sakshi

జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

సాక్షి, ఇల్లందకుంట: మీరు ఆదిరించిన బిడ్డగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని, తెలంగాణాలో ఆంధ్ర సీఎం చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు మహాకూటమితో కలిసి కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, దేశిని కోటి, పొనగంటి మల్లయ్య, మనోహర్‌రావు, వార్డు కౌన్సిలర్లు ,నాయకులు తదితరులు ఉన్నారు. 

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి
హుజూరాబాద్‌: సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని చెల్పూర్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రచారంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మొలుగూరి సరోజన, మండల అధ్యక్షుడు గోపు కొమురారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ దాసరి రమణారెడ్డి, కో కన్వీనర్‌ మండల సాయిబాబా, మాజీ సర్పంచ్‌ పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ ఖాలీక్‌హుస్సేన్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement