కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : మంత్రి

We live along with Corona virus says Puvvada Ajay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనాతో మనం సహ జీవనం చేయాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ ముగిశాక కూడా సానిటేషన్ మాస్క్‌లు తప్పనిసరిగా వాడాల్సి వస్తుందన్నారు. కరోనాతో ఎక్కువ దెబ్బతింటున్నది ట్రాన్స్‌పోర్ట్ విభాగమేనని, కేంద్రం నుండి సపోర్ట్ కావాలని అన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. (కరోనా కలవరం : వీడని విషాదం)

కోవిడ్ కిట్స్‌ను రవాణా శాఖలో పని చేస్తున్నవారికి అందిస్తున్నామని, మొదట రాష్ట్రాల సరిహద్దుల వద్ద పని చేస్తున్నవారికి ఇస్తున్నామని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. 5వేల కోవిడ్ కిట్లను డ్రైవర్లకు రవాణా శాఖ ద్వారా అందజేశామన్నారు. డ్రైవర్లకు కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నామని, ప్రజా రవాణాపై రేపు కేబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు. గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలా, వద్దా అనే విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలకు నష్టం జరిగిందని, కేంద్రం అన్ని రంగాలను ఆదుకోవాలని కోరామని చెప్పారు. (21దాకా లాక్‌డౌన్‌..?)

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top