ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

We Are Committed To Give Muslim Reservation In Telangana - Sakshi

బాన్సువాడ/కామారెడ్డి : ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్‌ అన్ని విధాలా చర్యలు తీసుకొంటున్నారని, కేంద్రంలో కీలకపాత్ర పోషి స్తే రిజర్వేషన్‌ సాధిస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ గార్డెన్‌లో, బాన్సువాడలోని భారత్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ముస్లింల సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. ఆయా సభల లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఏనా డూ బీజేపీతో కలవలేదన్నారు. స్వాతం త్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు కాం గ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదన్నా రు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిపిస్తే 170 స్థానాలతో సమానంగా పోరాటం చేస్తామన్నారు.

ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వైపు దేశం మొత్తం చూస్తోందని, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో అభివృద్ధి చెంది బంగారు భారతదేశంగా మారుతుంద ని యావత్‌ దేశ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రధాని అయితే కశ్మీర్‌ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ వారు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించడం వల్ల ఒరిగిందేమీ లేదని మహమూద్‌ అలీ పేర్కొన్నారు. సచార్‌ కమిటీ నివేదికను పక్కన పెట్టారన్నారు.

రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం అమ్మాయిల వివాహానికి కేవలం రూ. 25 వేలు ఇచ్చి ప్రచారానికి ఫొటోలు దిగేవారని, తాము రూ. 1,00,116 ఇస్తున్నా ప్రచారం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ. 634 కోట్లు షాదీ ముబారక్‌లో లబ్ధిదారులకు అందించామన్నారు.

నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
మరోసారి ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్, సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వైస్‌ చైర్మన్‌ మసూద్‌అలీ, నాయకులు ముస్తాక్‌ హుస్సేన్, జహీరుద్దీన్, అసద్, నేరెళ్ల ఆంజనేయులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top