పోలవరం నుంచి మహారాష్ట్ర వరకు గోదావరి నదిపై జలమార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
పోలవరం నుంచి మహారాష్ట్రకు జలమార్గం
Dec 9 2015 7:17 PM | Updated on Sep 3 2017 1:44 PM
ఖమ్మం: పోలవరం నుంచి మహారాష్ట్ర వరకు గోదావరి నదిపై జలమార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూజలమార్గంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా బీజం పడుతుందన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులు జలమార్గానికి అనుకూలంగా ఉండేలా నిర్మాణం చేస్తామని చెప్పారు.
కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు, కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వేలైన్ పై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఇవి త్వరిత గతిన వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ ను గెలిపించాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు.
-
Advertisement
Advertisement