కమ్మర్‌పల్లిలో వాటర్‌ ప్లాంట్‌ల సీజ్‌ | Water plants siege in Kammarpalli | Sakshi
Sakshi News home page

కమ్మర్‌పల్లిలో వాటర్‌ ప్లాంట్‌ల సీజ్‌

May 2 2017 3:13 AM | Updated on Sep 5 2017 10:08 AM

కమ్మర్‌పల్లిలో వాటర్‌ ప్లాంట్‌ల సీజ్‌

కమ్మర్‌పల్లిలో వాటర్‌ ప్లాంట్‌ల సీజ్‌

కమ్మర్‌పల్లి మండలంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న వాటర్‌ ప్యూరిఫైరింగ్‌ ప్లాంట్లను సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు.

కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండలంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న వాటర్‌ ప్యూరిఫైరింగ్‌ ప్లాంట్లను సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. కమ్మర్‌పల్లిలో 4, హాసాకొత్తూర్‌లో 2, బషీరాబాద్‌లో 1, చౌట్‌పల్లిలో 1, కోనాసముందర్‌లో 1 వాటర్‌ ప్లాంట్‌ను మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి, వీఆర్‌వోలు మూసి వేయించారు. వాటర్‌ ప్లాంట్ల యజమానులకు ఇదివరకే నోటీసులు ఇచ్చామని ఆర్‌ఐ తెలిపారు.  సీజ్‌ చేసిన ప్లాంట్లను తెరవకూడదని, తెరిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement