ఇతరుల బిడ్డను కాపాడి.. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అభాగ్యుడు | Washed into the river and killed children | Sakshi
Sakshi News home page

ఇతరుల బిడ్డను కాపాడి.. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అభాగ్యుడు

Nov 17 2014 1:54 AM | Updated on Sep 2 2017 4:35 PM

ఇతరుల బిడ్డను కాపాడి..  ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అభాగ్యుడు

ఇతరుల బిడ్డను కాపాడి.. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అభాగ్యుడు

గోదావరిలో మునిగిపోతున్న ఓ చిన్నారిని పరుగున వెళ్లి కాపాడాడు ఆ తండ్రి.....

నదిలో కొట్టుకుపోయి చిన్నారుల మృతి
 
చెన్నూర్: గోదావరిలో మునిగిపోతున్న ఓ చిన్నారిని పరుగున వెళ్లి కాపాడాడు ఆ తండ్రి.. తిరిగి వచ్చి చూడగా తన ఇద్దరు బిడ్డలు గల్లంతయ్యా రు. వెతికితే శవాలుగా మారి కనిపించిన ఉదం తం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఆదివారం జరిగింది. వివరాలు..  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెంది న పేరాల రామారావు చెన్నూర్‌లోని ఓ వైన్స్‌లో పని చేస్తున్నారు.

ఆదివారం చెన్నూరు సమీపంలోని గోదావరి వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలకు రామారావు, భార్య లావణ్య, ఇద్దరు కుమారులు సాయికృష్ణ(11) సాయి వర్షిత్(6)లు వెళ్లారు. పిల్లలు గోదావరిలో స్నానాలు చేస్తుండగా, వీరికి కొద్ది దూరంలో ఓ చిన్నారి నదిలో మునిగిపోతూ కనిపించాడు. దీంతో రామారావు వెళ్లి ఆ చిన్నారిని కాపాడాడు. తిరిగి వచ్చి చూడగా, తన ఇద్దరు కుమారులు కనిపించకుండా పోయారు. గాలించగా, ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సాయికృష్ణ నాలుగో తరగతి, సాయి వర్షిత్ ఎల్‌కేజీ చదువుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement