వార్డు మెంబర్ దారుణ హత్య | ward member murdered in Khanapur | Sakshi
Sakshi News home page

వార్డు మెంబర్ దారుణ హత్య

Apr 6 2015 9:51 AM | Updated on Jul 30 2018 8:29 PM

ఆదిలాబాద్ జిల్లాలో పాండు (25) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడనే సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

ఆదిలాబాద్(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లాలో పాండు (25) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడనే సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు..  ఖానాపూర్ మండలం పెంబి శివారులో ఉన్న నరసింహస్వామి గుట్ట వద్ద పాండు (25) అనే వ్యక్తి ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఆయన శెట్టిపల్లి వార్డు సభ్యుడిగా ఉండేవారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పాండును గొంతుకోసి కిరాతకంగా చంపేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement