పాసుబుక్కు అడిగితే కొట్టాడు.. | Vro attack on farmer | Sakshi
Sakshi News home page

పాసుబుక్కు అడిగితే కొట్టాడు..

Jul 27 2018 1:48 AM | Updated on Jul 27 2018 1:48 AM

పెబ్బేరు: పట్టాదారు పాసుబుక్కు అడిగిన పాపానికి రైతుపై వీఆర్వో దాడి చేసిన ఘటన ఇది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలో జనుంపల్లి గ్రామానికి చెందిన రైతు మన్నెపురెడ్డికి అదే గ్రామ శివార్లలో 4.34 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి పట్టాదార్‌ పాస్‌బుక్కు ఇచ్చేందుకు వీఆర్వో ఎం.కృష్ణయ్య కొన్నిరోజులుగా సతాయిస్తున్నాడని రైతు ఆరోపణ.

గురువారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన మున్నెపురెడ్డి ఉప తహసీల్దార్‌ ఎదుట వీఆర్వోను పాసుబుక్కు ఇవ్వాలని కోరగా.. ‘మాకేం పనిలేదా? ఎపుడూ మీ పనేనా?’అని గదమాయిస్తూ రైతు భుజంపై గట్టిగా కొట్టాడు. ఉప తహసీల్దార్‌ ఆశోక్‌కుమార్‌ జోక్యం చేసుకుని మన్నెపురెడ్డిని కాపాడారు. అనంతరం ఈ ఘటనపై మున్నెపురెడ్డి తహసీల్దార్‌ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. వీఆర్వో డబ్బులకోసం డిమాండ్‌ చేయగా తాను నిరాకరించానని మున్నెపురెడ్డి ఆరోపించారు. అందుకే పాస్‌బుక్‌ ఇవ్వడంలో జాప్యం చేయడమే కాకుండా దాడి చేశారని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement