
ఏఎస్‌రావునగర్: ఏఎస్‌రావునగర్ అణుపురం కాలనీలో కేఎల్‌ఎం (కీప్ లవింగ్ మోర్) ఫ్యాషన్ మాల్‌ను గురువారం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్బురపరిచే అంతర్జాతీయ ఫ్యాషన్స్, విభిన్న వెరైటీలను ఏఎస్‌రావునగర్ పరిసర ప్రాంతవాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సంస్థ సీఈవో కళ్యాణ్ మాట్లాడుతూ.. సరికొత్త ఫ్యాషన్ ప్రపంచంలో కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మరిన్ని కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్స్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. త్వరలో బోడుప్పల్, ప్యాట్నీ సెంటర్‌లలో షో రూంలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.