గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక విందు 

Venkaiah Naidu Invites Special Dinner For State Governors  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు ఢిల్లీలో రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో 50వ గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. గవర్నర్ల సదస్సులో ఉపరాష్ట్రపతి, ప్రధాని కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top