వాసవీ క్లబ్ సేవలు అభినందనీయం | vasavi club services | Sakshi
Sakshi News home page

వాసవీ క్లబ్ సేవలు అభినందనీయం

Mar 17 2014 2:52 AM | Updated on Sep 2 2017 4:47 AM

వాసవీ క్లబ్ సేవలు అభినందనీయం

వాసవీ క్లబ్ సేవలు అభినందనీయం

వాసవీ క్లబ్ వరంగల్ శాఖ బాధ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని క్లబ్ గవర్నర్ మాడిశెట్టి మదన్‌మోహన్ కొనియాడారు.

క్లబ్ గవర్నర్ మదన్‌మోహన్
 పింఛన్లు, పరీక్ష కిట్లతో పాటు బియ్యం పంపిణీ


 మట్టెవాడ, న్యూస్‌లైన్ : వాసవీ క్లబ్ వరంగల్ శాఖ బాధ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని క్లబ్ గవర్నర్ మాడిశెట్టి మదన్‌మోహన్ కొనియాడారు.

వరంగల్ పిన్నావారి వీధిలోని వాసవీక్లబ్ భవన్‌లో వరంగల్ శాఖ అధ్యక్షుడు గుముడవెల్లి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం రాత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో మదన్‌మోహన్ మాట్లాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు, అనాథలు, పేద విద్యార్థులను ఆదుకోవడంలో వాసవీ క్లబ్ బాధ్యులు ముందు వరుసలో నిలుస్తున్నారని తెలిపారు.
 
  భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనిస ఊచించారు. ఈ సందర్భంగా 22 మంది పేద మహిళలకు పింఛన్లు, 65 మంది విద్యార్థులు పరీక్ష కిట్లతో పాటు ఐదుగురు పేదలకు బియ్యం పంపిణీ చేశారు.
 
  కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి టి.వాసుదేవులు, కోశాధికారి గాదె వాసుదేవ్‌తో పాటు వల్లాల నాగేశ్వర్‌రావు, వి.సుధాకర్, కె.రాజగోపాల్, సంతోష్‌కిరణ్, శ్రీరాం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement