కుటుంబం కోసం మాదిగ జాతిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ అమ్ముకున్నారని ఎంఎస్‌ఎఫ్-టీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.
మంద కృష్ణపై వంగపల్లి ధ్వజం
హైదరాబాద్: కుటుంబం కోసం మాదిగ జాతిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ అమ్ముకున్నారని ఎంఎస్‌ఎఫ్-టీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శుక్రవారం ఓయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనపెట్టి మాదిగలను మోసం చేసిన చంద్రబాబును ఏపీలో తిరగనీయమని ప్రగల్బాలు పలికిన మందకృష్ణ.. హైదరాబాద్‌లో టీడీపీ మహానాడు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ తన కూతురుకు మెడిసిన్‌లో పీజీ సీటు కోసం రూ. 1.50 కోట్లకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడని పేర్కొన్నారు. సమావేశంలో అలెగ్జాండర్, నగేశ్, కొంగరి శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.