బర్డ్ ఫ్లూ... బహుపరాక్ | vaccine of bird flu | Sakshi
Sakshi News home page

బర్డ్ ఫ్లూ... బహుపరాక్

Apr 15 2015 2:28 AM | Updated on Sep 3 2017 12:18 AM

బర్డ్ ఫ్లూ... బహుపరాక్

బర్డ్ ఫ్లూ... బహుపరాక్

కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడం...

- ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి
- పశుసంవర్థక శాఖ సంయుక్త
- సంచాలకులు వెంకయ్య నాయుడు

 పోచమ్మమైదాన్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయూరుు. ఈ విషయమై అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సూచనలు చేసింది.
ఈ సందర్భంగా బర్డ్ ఫ్లూ లక్షణాలు-నివారణ కు తీసుకోవాల్సిన చర్యల గురించి పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు వెంకయ్య నాయుడు వివరించారు. జిల్లాలో 48.83 లక్షల కోళ్లు ఉన్నాయ ని, బర్డ్ ఫ్లూ వ్యాధి అన్ని జాతుల కోళ్లు, బాతులకు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మనుషులపైనా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. అరుు తే జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని, అరుునా కోళ్ల ఫారాల యజమానులు, పెంపకం రైతులు, చికెన్ షాప్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
 
బర్డ్ ఫ్లూ లక్షణాలు
- ముక్కు, నోటి నుంచి ద్రవాలు కారుతూ సాధార ణ జలుబు లక్షణాలు కనబతారుు.
- తల కొప్ప, వాటిల్స్, నీలం రంగుగా మారి కనపడుతుంది.
- కాళ్ల మీద వాపు వచ్చి ఎర్రగా మారతాయి.
- వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చగా విరేచనాలు, రక్తంలా ద్రవాలు నోటి నుంచి ముక్కు నుంచి కారతాయి.
-కోళ్ల ఫారంలో, చికెన్ షాపులలో పనిచేసే వ్యక్తుల కు వ్యాధి సోకిన కోళ్ల పేడ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మనుషులలో సాధారణ జలుబు లక్షణాలుండి జ్వరం వస్తుంది.
 
కోళ్ల ఫారం యజమానులకు
- రంగారెడ్డి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలింది. అక్కడి నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దు.
-కోళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.
-ఫారంలో పని చేసే వ్యక్తులు పరిసరాలు, వాహనాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
-చికెన్ షాప్ యజమానులకు..
-వ్యాధి సోకిన కోళ్లను ఫారాల నుంచి కొనుగోలు చేయవద్దు.
-చికెన్ షాప్ వ్యర్థాలను సక్రమంగా కాల్చివేయడం లేదా బొంద తీసి పాతి పెట్టాలి.
-షాప్‌లో పని చేసే వ్యక్తులు, కోళ్లను తీసుకువచ్చే వాహనాలతోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement