నేలపట్లలో బర్డ్‌ఫ్లూ.. నిర్ధారించిన అధికారులు | Officials confirm bird flu in nelapatla | Sakshi
Sakshi News home page

నేలపట్లలో బర్డ్‌ఫ్లూ.. నిర్ధారించిన అధికారులు

Feb 23 2025 4:40 AM | Updated on Feb 23 2025 4:40 AM

Officials confirm bird flu in nelapatla

గ్రామంతోపాటు పరిసరాల్లోని కోళ్లఫారాల మూసివేత  

భయపడాల్సిన పనిలేదన్న భువనగిరి జిల్లా పశువైద్యాధికారి 

నిర్భయంగా చికెన్‌ తినవచ్చు.. వండినప్పుడు వేడికి వైరస్‌ చనిపోతుంది

చౌటుప్పల్‌ రూరల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం నేలపట్ల గ్రామంలోని పౌల్ట్రీఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకింది. ఈ నెల 15వ తేదీన పబ్బు మల్లేశ్‌ అనే రైతు కోళ్ల ఫామ్‌లో సుమారు 800 కోళ్లు మృతిచెందాయి. పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండల పశువైద్యాధికారి పృథ్వీరాజ్‌.. మల్లేశ్‌ కోళ్ల ఫామ్‌ను సందర్శించి చనిపోయి న కోళ్ల నుంచి శాంపిల్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 

నేలపట్లలో చనిపోయిన కోళ్లకు బర్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ జరిగిందని జిల్లా పశువైద్యాధికారి జానయ్య శనివారం తె లిపారు. నేలపట్ల గ్రామంలో కోళ్లఫామ్‌లను ఆయన సందర్శించారు. బర్డ్‌ప్లూ నిర్ధారణ అయిన కోళ్లఫామ్‌లోని మి గతా కోళ్లను చంపివేసి అక్కడే భూమిలో పాతిపెట్టించా రు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రామంలో పో లీస్‌ పికెట్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు జానయ్య చెప్పారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్‌ఫ్లూ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వివరించారు. నేలపట్ల గ్రామం పరిధిలోని ఐదు కోళ్ల ఫారాలను మూసివేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బర్‌ఫ్లూ కేసు నమోదైనా కూడా ఈ ప్రాంత ప్రజలు భయపడాల్సిన పనిలేదని, చికెన్‌ను నిర్భయంగా తినవచ్చని, కోడి మాంసం వండినప్పుడు ఆ వేడికి వైరస్‌ చనిపోతుందని తెలిపారు.  

నేలపట్లకు ఆర్డీఓ.. 
నేలపట్ల గ్రామాన్ని చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి సందర్శించారు. గ్రామంలోని పలు కోళ్లఫారాలను ఆయన పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌ నేలపట్ల గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement