టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ | uttamkumarreddy assumed charge as tpcc chief | Sakshi
Sakshi News home page

టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్

Mar 8 2015 4:24 PM | Updated on Oct 8 2018 9:21 PM

టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ - Sakshi

టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం గాంధీభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం గాంధీభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. అంతకన్నాముందు వీరు బంజారా హిల్స్లోని తమ నివాసాలనుంచి భారీ ర్యాలీగా పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి గాంధీభవన్కు వచ్చారు.

 

అయితే, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం దగ్గర పెట్టిన ప్లెక్సీల్లో పొన్నాల ఫొటో లేకపోవడం విమర్షలకు తావిచ్చింది. అది ఆయనకు జరిగిన అవమానమేనంటూ పొన్నాల వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ ఇటీవలె ఉత్తమ్కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్గా, మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement