ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తాళం | urusu government hospital issue in warangal | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తాళం

Apr 24 2015 4:10 PM | Updated on Aug 24 2018 6:44 PM

వరంగల్ జిల్లాలోని ఉరుసు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు స్థానికులతో కలిసి తాళం వేశారు.

వరంగల్ (కరీమాబాద్) : వరంగల్ జిల్లాలోని ఉరుసు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు స్థానికులతో కలిసి తాళం వేశారు. వివరాల ప్రకారం.. ఉరుసు ఆసుపత్రి వరంగల్ జిల్లాలోని చంద్రకాంతయ్య మెమోరియల్ ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తుంది.

 

ఈ ఉరుసు ఆసుపత్రిలో కొంతకాలంగా వైద్య సిబ్బంది లేరు. ప్రభుత్వాసుపత్రులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ఎంసీఐ బృందం వస్తుండటంతో అధికారులు హుటాహుటిన డిప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆసుపత్రికి తాళం వేసి తమ నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement