వన్యప్రాణుల సంరక్షణ కోసం.. రాజస్థాన్‌కు ఉపాసన

Upasana New Initiative For Save India Big Cats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన 'సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్' అనే పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించడానికి  డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహకారంతో హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు వెళ్లారు. జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సామాజిక అంశాలపై ఉపాసన చూపుతున్న శ్రద్ద పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

శనివారం రాజస్థాన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రంతంబోర్ నేషనల్ పార్క్ కి వారు వెళ్లారు. కాగా వారు మొదటి రోజు ఉదయం సవాయ్ మధోపూర్ నగరంలోని స్టార్ హోటల్ అయిన తాజ్ వివంతా కి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత వారు చేయబోయే కార్యక్రమానికి వార్మప్ గా ఉండాలని యోగ చేసి మనసును తేలిక పరుచుకున్నారు. హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆమెకు  ఉన్న ఆసక్తి ని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్ లు చేసే డిజర్ట్స్, వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. శ్రావ్యమైన మెలోడీస్ , డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్ తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే  అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలుగా తర్వాతి రోజుకు వారు ఎదురుచూస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top