అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన | untimely rain farmers worried | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన

Oct 30 2015 9:04 AM | Updated on Oct 1 2018 2:09 PM

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం కలిగించింది.

నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం కలిగించింది. శుక్రవారం తెల్లవారు జామున జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవటంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఉంచారు. వర్షం దెబ్బకు రోడ్లపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement