బడ్జెట్‌లో మహబూబ్‌నగర్‌కు మోదం..ఖేదం

Union Budget 2020 Budget Allocation For Mahabubnagar - Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహకం..అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక 
టాస్క్‌ఫోర్స్‌.. గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు, విద్యుత్, స్వచ్ఛభారత్, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు తదితర వాటిపై ఆశాజనకంగా ఉంది. అయితే హైదరాబాద్‌ నుంచి బెంగళూర్‌ హైవేకు ఇండస్ట్రీ కారిడార్‌ గురించి ప్రస్తావించకపోవడం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకపోవడం నిరాశే.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా.. వారి సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు రూ.15లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.83లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 6.11కోట్ల మందికి ఫసల్‌ బీమా యోజన వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 8,51,385 మంది రైతుల్లో ఆశలు చిగురించాయి. మహబూబ్‌నగర్‌లో 1,78,012 మంది రైతులు ఉండగా, నారాయణపేటలో 1,28,905, నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 2,58,000, గద్వాలలో 1,44,445, వనపర్తిలో 1,42,023 మంది రైతులు ఉన్నారు. కేంద్రం కురిపించిన వరాల్లో ఏఏ జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

అయితే.. కేంద్ర బడ్జెట్‌పై జిల్లా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అలాగే బంజరు, తడి భూములు కలిగిన రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేలా వారి భూముల్లో సౌర యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్‌ను గ్రిడ్‌లకు సరఫరా చేసి.. తద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. యువ మత్స్య కారి్మకుల ప్రోత్సాహంలో భాగంగా ‘సాగర్‌ మిత్రాస్‌’ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే దీనితో ఎంత మంది లబి్ధపొందుతారో అనేది స్పష్టమవుతుంది. అయితే.. ప్రస్తుతం మత్స్య కారి్మకులకు బాసటగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం చెరువులను పునరుద్ధరించి అందులో చేపల పెంపకానికి చేయూతనిస్తోంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షలకు పైగా మంది ప్రస్తుతం లబి్ధపొందుతున్నారు. ‘సాగర్‌ మిత్రాస్‌’ పథకం ద్వారా మరింత మందికి లబి్ధచేకూరే అవకాశముంది. 

చిగురించిన ఆశలు..
దేశంలో ఆరు లక్షల మంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రాజెక్టుల పరిధిలో 5,003 అంగన్‌వాడీ కేంద్రాలు.. అంతే మంది టీచర్లు ఉన్నారు. వీరిలో ఎంత మందికి సెల్‌ఫోన్లు వస్తాయో చూడాలి. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి.. పౌష్టికాహార పథకానికి రూ.35.6కోట్లు కేటాయించినట్లు వివరించారు. అయితే.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50వేలకు పైనే ఉంది. వీరిలో 20వేలకు పైగా మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. మహిళా సంక్షేమ పథకాలకు రూ.28,600కోట్లు కేటాయించడంతో జిల్లాలో మరింత మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది.

పర్యాటక రంగ ప్రోత్సాహానికి ఈ సారి బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ సైతం మన జిల్లా పరిధిలోని మయూరి పార్కు, మన్యంకొండ, కోయిల్‌సాగర్‌ ప్రాంతాలతో పాటు వరంగల్‌నూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇది వరకే రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఏ మేరకు నిధులు వస్తాయో అనే ఆసక్తి నెలకొంది. అలాగే క్రీడల అభివృద్ధికి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. అందులో మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ హాస్టల్, ఇండోర్‌ స్టేడియం, క్రీడా మైదానాల అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ఏ మేరకు మంజూరవుతాయో చూడాలి.

ఆశలకు రెక్కలు.. 
వచ్చే నాలుగేళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఇప్పటికే పాలమూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బృందం సభ్యులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత దేవరకద్ర మండలంలోని చౌదర్‌పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి.. అలాగే భూత్పూర్‌ మండలంలోని పోతులమడుగు, రావులపల్లి, కప్పెట గ్రామాల పరిధిలోని భూముల్లో అనువుగా ఉన్న భూములను ఎంపికతో పాటు మ్యాప్‌ను రూపొందించి ప్రతిపాదనలు కూడ సిద్ధం చేశారు.

తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో దేవరకద్ర నియోజకవర్గంలో ఏదో చోటా విమానాశ్రయం రాబోతుందనే ఆశలు ఉమ్మడి జిల్లా ప్రజల్లో చిగురించాయి.   ఆశలకు రెక్కలు.. వచ్చే నాలుగేళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఇప్పటికే పాలమూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బృందం సభ్యులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత దేవరకద్ర మండలంలోని చౌదర్‌పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి.. అలాగే భూత్పూర్‌ మండలంలోని పోతులమడుగు, రావులపల్లి, కప్పెట గ్రామాల పరిధిలోని భూముల్లో అనువుగా ఉన్న భూములను ఎంపికతో పాటు మ్యాప్‌ను రూపొందించి ప్రతిపాదనలు కూడ సిద్ధం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో దేవరకద్ర నియోజకవర్గంలో ఏదో చోటా విమానాశ్రయం రాబోతుందనే ఆశలు ఉమ్మడి జిల్లా ప్రజల్లో చిగురించాయి.

ఏదీ ‘జాతీయ హోదా’?
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఈ సారీ జాతీయ హోదా వరించలేదు. నిధుల సమస్యతో నత్తకు నడక నేర్పుతోన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకున్నా.. ఇంకా నిధుల సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేంద్ర నిధులూ వస్తాయనే ఆశతో ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని ప్రతి ఏటా కేంద్రాన్ని అభ్యరి్థస్తూనే ఉంది. ఇటు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ ప్రాంత ప్రజల సమస్యలు తనకు తెలుసని.. వాటిని తీరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ సారైనా జాతీయ హోదా వస్తుందనే ఆశతో ఉన్న ప్రభుత్వానికి నిరాశే మిగిలింది.

జాతీయ హోదాను విస్మరించారు  
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాటిని పట్టించుకోకపోవడం కేంద్రం వ్యవసాయాన్ని విస్మరించడమే. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2008 నుంచి కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేవలం పశుగ్రాసం పండించే వారికి మాత్రమే ఉపాధిహామీ అనుసంధానం చేస్తామనడం సరికాదు.

కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. జిల్లాకో పంట కాలనీకి సహకారం అందిస్తామని బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. మరి దేశంలోని ఎన్ని జిల్లాలకు ? ఏఏ రాష్ట్రాలకు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం పంటకాలనీల ప్రాధాన్యతను గుర్తించి ఇప్పటికే దాదాపుఓ ప్రణాళికను సిద్ధం చేసింది. దానికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో వేచిచూడాలి. తాజా బడ్జెట్‌ కూడా వ్యవసాయ రంగం విషయంలో కంటితుడుపుగానే వ్యవహరించింది.  
– నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

జిల్లాకు ఎన్నొస్తాయో చూడాలి  
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌ను పురస్కరించుకుని.. జిల్లాలో మయూరి పార్కు, మన్యంకొండ, కోయిల్‌సాగర్‌ తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఇది వరకే కోరాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.450 కోట్లు అడిగాం. ఈ రోజు ప్రకటించిన టూరిజం ప్రోత్సాహక బడ్జెట్‌లో రూ.2,500 కేటాయింపులు జరిగాయి. ఇందులో మన జిల్లాకు, రాష్ట్రానికి ఎంత వస్తుందో చూడాలి.
– శ్రీనివాస్‌గౌడ్, ఎౖక్సైజ్‌ శాఖ మంత్రి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top