గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య | Unidentified Person commits Suicide | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

Jun 15 2015 3:49 PM | Updated on Nov 6 2018 7:56 PM

గుర్తుతెలియని ఒక వ్యక్తి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

నేరేడుకొండ (ఆదిలాబాద్ జిల్లా) : గుర్తుతెలియని ఒక వ్యక్తి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలం గౌలీగూడ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు చెట్టుకు వేలాడుతూ ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement