వివస్త్రను చేసి.. అత్యాచారయత్నం | two youth Attempt to Rape Girl at Guduru | Sakshi
Sakshi News home page

వివస్త్రను చేసి.. అత్యాచారయత్నం

Sep 1 2014 10:48 AM | Updated on Jul 28 2018 8:51 PM

పశువులు మేపే ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించారు.

గూడూరు: పశువులు మేపే ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు గండితండాలో ఆది వారం జరిగింది. బాధితురాలి తల్లి కథనం ప్రకా రం.. తండాకు చెందిన దంపతులకు పదమూడేళ్ల కుమార్తె ఉంది. నిరక్ష్యరాస్యురాలైన ఆమె పశువుల కాపరిగా పనిచేస్తోంది. ఉదయం పశువులను అడవిలోకి మేత కోసం తెలిసిన కాపరికి అప్పగించేందుకు తోలుకెళ్లింది.

ఈ క్రమంలో వరుసకు సోదరులైన తండాకు చెందిన ఇద్దరు యువకులు అడవిలో కాపు కాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. భయభ్రాంతులకు గురిచేశారు. లైంగికదాడికి యత్నించిన ఆ యువకులు బాలికను వివస్త్రను చేసి బెదిరించారు. చివరకు వారి బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక కేక లు వేస్తూ తండాకు పరుగెత్తుకొచ్చింది. గమనిం చిన మహిళలు వారి చీరను కప్పి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులతో కలసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement