రెండు కొత్త మార్కెట్‌ కమిటీలు | Two new market committees | Sakshi
Sakshi News home page

రెండు కొత్త మార్కెట్‌ కమిటీలు

Sep 22 2017 12:26 AM | Updated on Sep 22 2017 10:02 AM

జనగామ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో కొత్త మార్కెట్‌ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌: జనగామ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో కొత్త మార్కెట్‌ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొడకండ్ల మార్కెట్‌ కమిటీలో భాగంగా ఉన్న పాలకుర్తి మండలంలోని గ్రామాలను వేరు చేస్తూ పాలకుర్తి మార్కెట్‌ కమిటీని, వంటిమామిడి మార్కెట్‌ కమిటీలో భాగంగా ఉన్న తూప్రాన్, మనోహరాబాద్‌ మండలాల్లోని గ్రామాలను వేరు చేస్తూ తూప్రాన్‌ మార్కెట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే నిర్మల్‌ జిల్లా నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ పరిధిలోని లక్ష్మణచందలో సబ్‌ మార్కెట్‌ యార్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement