
చింతలమానెపల్లి (సిర్పూర్): ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదం మిగిల్చింది. శనివారం గల్లంతైన బీట్ అధికారులు మంజం బాలకృష్ణ ((31), బదావత్ సురేష్ నాయక్ (35)ల మృతదేహాలు సోమవారం లభ్యమ య్యాయి. చేపల వలకు చిక్కి జీవచ్ఛవాలుగా కనిపించాయి. ఉదయం నుంచే చింతలమానెపల్లి, మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్లకు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో నదిలో చేపల వేటకు ఏర్పాటు చేసిన వలలో మృతదేహాలు చిక్కుకుని కనిపించాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీం ఇన్‌స్పెక్టర్ పవన్ ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీశారు. కాగా, ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందడం పట్ల అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.