మేడ్చల్ మండలంలోని ఐటీఐ వద్ద ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది.
మేడ్చల్ మండలంలోని ఐటీఐ వద్ద ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకులు మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. ముగ్గురూ అత్వెల్లి గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.