రోడ్డు ప్రమాదం:ఇద్దరు విద్యార్థుల మృతి | two killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం:ఇద్దరు విద్యార్థుల మృతి

Jan 8 2015 8:25 AM | Updated on Apr 3 2019 7:53 PM

నగరంలోని చాదర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.

హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. టిప్పర్ ను తప్పించబోయిన ఓ కారు విక్టరీ ప్లే గ్రౌండ్స్ దగ్గర గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

 

ప్రమాదంలో గాయపడిన వారికి ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన విద్యార్థులను వరుణ్, నరేందర్ గా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement