ఆసిఫాబాద్‌లో రెండు కరోనా కేసులు | Two Corona Positive Cases Reported In Asifabad | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌లో రెండు కరోనా కేసులు

Apr 11 2020 4:35 PM | Updated on Apr 11 2020 4:47 PM

Two Corona Positive Cases Reported In Asifabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆసిఫాబాద్‌లో మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తి ఇంట్లో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. మర్కజ్‌ వెళ్లొచ్చిన తండ్రికి నెగిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆయన ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్‌ రావడం పట్ల వైద్యాధికారులు విస్మయం చెందుతున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మర్కస్‌ వెళ్లొచ్చిన జైనుర్‌కు చెందిన వ్యక్తిని ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు అధికారులు తరలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కూడా వాంకిడి ఆశ్రమ పాఠశాల క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షల కోసం వారి  శాంపిల్స్‌ను సేకరించి పంపించారు. శుక్రవారం వచ్చిన రిపోర్ట్స్‌లో మర్కస్‌ వెళ్లొచ్చిన తండ్రికి నెగిటివ్‌ వచ్చి.. ఆయన కుమారులు ఇద్దరికి పాజిటివ్‌ రావడం పట్ల ఇదెలా సాధ్యం అన్న అనుమానంతో వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement