ఒక అమ్మాయి.. ఇద్దరబ్బాయిల ప్రేమకథ | two boys falling in love with one girl | Sakshi
Sakshi News home page

ఒక అమ్మాయి.. ఇద్దరబ్బాయిల ప్రేమకథ

Apr 9 2014 9:50 AM | Updated on Aug 25 2018 6:52 PM

ఒక అమ్మాయి.. ఇద్దరబ్బాయిల ప్రేమకథ - Sakshi

ఒక అమ్మాయి.. ఇద్దరబ్బాయిల ప్రేమకథ

కాజీపేట బాపూజీనగర్‌లో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్న ఘటన వెనక పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

కాజీపేట  : కాజీపేట బాపూజీనగర్‌లో  సోమవారం రాత్రి  ఓ యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్న ఘటన వెనక పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కాజీపేట పట్టణానికి చెందిన ఓ యువతి వేర్వేరు కాలేజీలకు చెందిన ఇద్దరు అబ్బాయిలతో చనువుగా ఉంటూ రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోంది.

ఇటీవల ఆమె ఓ యువకుడితో ఉన్నప్పుడు మరో యువకుడి కంటపడింది. దీన్ని జీర్ణించుకోలేని సదరు యువకుడు అక్కడే యువతి వెంట ఉన్న యువకుడితో ఘర్షణకు దిగాడు. అప్పటి నుంచి ఆ ఇద్దరు తమ తమ స్నేహితులతో రెండు వర్గాలుగా విడిపోయి సమయం దొరికినప్పుడుల్లా దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల తీవ్రస్థాయిలో గొడవలు జరగగా ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దాంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి స్థానిక నాయకుల జోక్యంతో పంపించారు. రెండు రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన నాగేశ్వర్‌రావు ....ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ యువకుడిని బెదిరించినట్లు తెలుస్తోంది. దాంతో ఆగ్రహించిన మిత్రులు మాటువేసి బాపూజీనగర్ చౌరస్తాలో అతడిపై దాడి చేశారని తెలిసింది. యువతి కోసం ఇద్దరు యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడులు చేసుకుని, కేసుల్లో ఇరుక్కోవడం చర్చనీయూంశంగా మారింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement