గడువు దాటితే వేటే!

TSRTC Strike: KCR Says Will Not Allow Employees To Work After Deadline - Sakshi

ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోవద్దు

కార్మికులు చేరకుంటే ఆర్టీసీ ఉండదు

అన్ని రూట్లలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు

ఆర్టీసీ సమ్మెపై సీఎం సమీక్షలో ఏకగ్రీవ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది. గడువులోగా చేరని కార్మి కులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్ల యిందని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? విని యోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేటు వాహ నాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని మరో సారి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయాన్ని సీఎం కార్యా లయం ఓ ప్రకటనలో వెల్లడిం చింది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆది వారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో సమీక్షించారు. సమ్మె విష యంలో, కోర్టు విచారణ సంద ర్భంగా అనుసరించాల్సిన వైఖ రిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు.

కార్మికులు ఎవరినీ బద్నాం చేయలేరు..
‘ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు, వారి కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఉద్యోగాలు కాపాడుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉంది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. విధుల్లో చేరడానికి 3 రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు. ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది కార్మికుల ఇష్టం. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తన నిర్ణయాన్ని  అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు’అని సీఎం, మంత్రులు, అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సీఎంఓ తెలిపింది.

సుప్రీంకు వెళ్తే అంతే..
‘హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్‌ నేతలు కార్మికులను మభ్యపెడుతున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలిచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే, విచారణ మరింత ఆలస్యమవుతుంది. అది అంతంలేని పోరాటం అవుతుంది. కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు’అని అభిప్రాయం వ్యక్తమైంది. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్‌కే జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణరావు, సునీల్‌ శర్మ, సందీప్‌ సుల్తానియా, అరవింద్‌ కుమార్, లోకేశ్‌ కుమార్, అడ్వకేట్‌ జనరల్‌ శివానంద ప్రసాద్, అడిషనల్‌ ఏజీ రాంచందర్‌రావు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top