సీఎంవోకు ఫోన్‌కాల్‌.. వైరల్‌ ఆడియో క్లిప్‌పై ఫిర్యాదు!

TSRTC Strike: CMO Gives Clarity on Talks with RTC JAC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెల్ప్‌లైన్‌కు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికలు, చానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులు సోమవారం హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

సీఎంవోకు వచ్చిన ఫోన్‌కాల్‌ అంటూ 2.56 నిమిషాల నిడివి గల  ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌ సెల్‌కు  కాల్‌ చేసి ముఖ్యమంత్రి వైఖరిని తప్పు పట్టిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు’ అంటూ వాట్సాప్‌లో ఇది చక్కర్లు కొడుతోంది. ఈ నకిలీ ఆడియో ద్వారా సీఎంపై దుష్ఫ్రచారం చేస్తున్న వ్యవహారాన్ని సీఎంవో సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులు సీపీని కోరారు. దీనిపై స్పందించిన ఆయన కేసును సాంకేతికంగా దర్యాప్తు చేయాలని, బాధ్యుల్ని తక్షణం గుర్తించాలని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top